చైర్మన్ పాండురంగారెడ్డి అధ్యక్షతన మున్సిపల్ సర్వసభ్య సమావేశం…
అమీన్ పూర్:
ప్రజల సహకారం, ప్రజాప్రతినిధుల సలహాలు సూచనలకు అనుగుణంగా అమీన్పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నట్లు మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు.
బుధవారం చైర్మన్ పాండురంగారెడ్డి అధ్యక్షతన మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా 17 కోట్ల రూపాయలతో నిర్వహించతలపెట్టిన అభివద్ధి కార్యక్రమాలకు సమావేశంలో సభ్యులు ఆమోదం తెలిపారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ… రాజకీయాలకు అతీతంగా అభివద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. హరితహారం పట్టణ ప్రగతి లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.వార్డు కమిటీ సమావేశాల్లో ప్రజల సూచించిన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టేందుకు నిర్ణయించామన్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా అభివద్ధి పనులు చేపడుతున్నామని గుర్తు చేశారు.అన్ని వార్డులకు సమప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అన్ని పార్టీలకు చెందిన వార్డు సభ్యులు కోరినట్లుగా నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు.
గురువారం నుంచి నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపు నిచ్చారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.