_క్యాసారం లో రెండు కోట్ల 92 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్ చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం పటాన్ చెరు మండలం క్యాసారం గ్రామంలో రెండు కోట్ల 20 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో చేపట్టనున్న అంతర్గత మురుగునీటి కాల్వల నిర్మాణ పనులకు, కిర్బీ పరిశ్రమ నుండి క్యాసారం గ్రామం వరకు 72 లక్షల రూపాయలతో చేపట్టనున్న బిటి రోడ్డు పునరుద్ధరణ పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రతి గ్రామ పంచాయతీకి జనాభా ఆధారంగా ప్రతి నెల నిధులు కేటాయించడంతో పాటు మౌళిక వసతుల కల్పనకు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పెంటయ్య, ఎంపీటీసీ రామ్ చందర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, విక్రమ్ గౌడ్, రమేష్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…