Telangana

నిర్మాణాల పునరుద్ధరణకు అధునాతన సాంకేతికత…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

నిర్మాణాల పునరుద్ధరణ , మరమ్మతులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినట్టు గీతం పూర్వ విద్యార్థి , హిల్టీ ఇండియా స్పెసిఫికేషన్ కన్సల్టెంట్ త్రివేద్ నౌదురి చెప్పారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ నిర్మాణాల పునరుద్ధరణకు రూపకల్పన పరిష్కారాలు ‘ అనే అంశంపై బుధవారం నిర్వహించిన ఒకరోజు వర్క్షాప్లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు . గీతం ఆవిష్కరణల మండలి ( ఐఐసీ ) సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యశాలలో ఆయన మాట్లాడుతూ , నిర్మాణాల మరమ్మత్తు , పునరావాసంలో ముందుగానే ఏర్పాటుచేసిన యాంకరింగ్ క్రియాశీల భూమిక పోషిస్తుందని చెప్పారు . ఎందుకంటే , అప్పటికే ఉన్న నిర్మాణాలను అనుసంధానించడానికి , కొత్త విభాగాల ఏర్పాటుకు యాంకరింగ్ తోడ్పడుతుందన్నారు .

స్ట్రక్చరల్ రీబార్ యాంకరింగ్ అంటే- అప్పటికే ఉన్న కాంక్రీటు నిర్మాణంలో రంధ్రాలు చేయడం , వాటిలోకి ఇనుప రాడ్లను చొప్పించడం , రసాయనాలను పంపించడమని త్రివేద్ వివరించారు . ఈ విధానంలో ప్రధాన నిర్మాణాన్ని మార్చకుండా , ప్రస్తుత అవసరాల మేరకు ఆయా సౌకర్యాలను పునరుద్ధరించవచ్చన్నారు . యాంకర్ ఆధార పలకను కాంక్రీటుకు అనుసంధానం చేయడానికి అవసరమైన యాంకర్ల సంఖ్య , చుట్టుకొలత , చొప్పించాల్సిన లోతులను లెక్కించగల అంతర్జాతీయ హిల్టీ ప్రొఫెస్ట్ సాఫ్ట్వేర్ను ఆయన గీతం విద్యార్థులకు పరిచయం చేశారు . త్రివేద్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యశాలలో హిల్టీ ఇండియా సాంకేతిక విభాగాధిపతి ముఖేష్ ఆలూరు , కన్సల్టెంట్ సల్మాన్ కూడా పాల్గొన్నారు . విద్యార్థులు లేవనెత్తిన పలు సందేహాలను వారు నివృత్తిచేశారు . తొలుత , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య అతిథిని సత్కరించారు . గీతం పూర్వ విద్యార్థుల సమన్వయకర్త డాక్టర్ పి.త్రినాథరావు స్వాగతోపన్యాసం చేయగా , కార్యశాల నిర్వాహకురాలు డాక్టర్ జి.జ్యోతికుమారి వందన సమర్పణ చేశారు .

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

3 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

3 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

3 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

3 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

3 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago