మనవార్తలు ,శేరిలింగంపల్లి :
ప్రతీ వస్తువు కలుషితమవుతున్న ఈ రోజుల్లో వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను విజేత సూపర్ మార్కెట్ అందజేస్తుందని కొండాపూర్ బ్రాంచ్ భవన యజమాని కృష్ణారెడ్డి అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన 88 వ బ్రాంచ్ ను శుక్రవారం రోజు విజేత సూపర్ మార్కెట్ ఎం.డి జగన్మోహన్ రావు తో కల్సి ప్రారంభించారు. మెట్రో నగరమైన హైదరాబాద్ లో ఎన్నో షాపింగ్ మాల్స్ ఉన్నప్పటికీ వాటి పోటీని తట్టుకుని నేడు 88 వ బ్రాంచ్ ప్రారంభించడం అభినందించదగిన విషయమని, వినియోగదారుల మన్ననలు పొందుతూ ముందు ముందు మరిన్ని బ్రాంచ్ లను ఏర్పాటు చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇపుడున్న పోటీ ప్రపంచంలో వ్యాపారంలో రాణించాలంటే మాములు విషయం కాదని, అది అంకితభావం, దృఢ సంకల్పం ఉన్న జగన్మోహన్ రావు లాంటి వారికే సాధ్యమన్నారు. సుదీర్ఘ కాలం పాటు వ్యాపారం సాగి మంచి లాభాలు రావడంతో పాటు మరెంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…
అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…