Telangana

గీతంలో విజయవంతంగా పైలట్ శిక్షణ కార్యశాల

ఫ్లైట్ సిమ్యులేటర్ పై శిక్షణ ఇచ్చిన కెప్టెన్ విగో

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో ‘ఫ్లైట్ సిమ్యులేటర్’పై ఒకరోజు పైలట్ శిక్షణా కార్యశాలను గురువారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, శిక్షకునిగా స్పేస్ జెన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) కెప్టెన్ విగో పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, డీన్-కోర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ రామశాస్ర్తి వేదాల మాట్లాడుతూ, పైలటింగ్ సిస్టమ్స్ లో అనుభవం గడించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఏరోస్పేస్ లోని ప్రతి విద్యార్థీ కనీసం ఒక నెల నుంచి మూడు నెలల వరకు ఇంటర్న్ షిప్ లేదా పరిశ్రమ శిక్షణా కార్యక్రమంలో పాల్గొని స్వీయ అనుభవం గడించాలని సూచించారు. విద్యార్థులకు అనువైన పరిశ్రమలను గుర్తించి, వారితో సంప్రదింపులు జరిపి, విలువైన శిక్షణావకాశాలను పొందాలన్నారు. అందుకు అవసరమైన సహకారాన్ని తాము అందిస్తామని భరోసా ఇచ్చారు. గీతమ్, హైదరాబాద్ లో ఏరోనాటికల్ సొసైటీ విద్యార్థి విభాగాన్ని ప్రారంభించాలని, అందుకు అవసరమైన రుసుములు సంస్థాగతంగా చెల్లిస్తామని విద్యార్థుల హర్షధ్వానల మధ్య హామీ ఇచ్చారు.

పరిశ్రమ, విద్యా సంస్థల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడంతో పాటు, ఔత్సాహిక ఏరోస్పేస్ ఇంజనీర్ల కెరీర్ అవకాశాలను మెరుగుపరచే లక్ష్యంతో తాను ఈ కార్యశాలను నిర్వహిస్తున్నట్టు కెప్టెన్ విగో తెలియజేశారు. ఈ రంగంలో ఆచరణాత్మక అనుభవం ప్రాధాన్యాన్ని వివరిస్తూ, తమ అకాడమీలో శిక్షణ పొందిన వారిలో 400 మంది వరకు పైలట్ గా ఎంపికయ్యారని, ఇటీవలి పాసింగ్ అవుట్ పరేడ్ లో ఇరవై మంది తమ విద్యార్థులున్నట్టు చెప్పారు.ఫ్లైట్ సిమ్యులేటర్ ను పరిచేయించడంలో కెప్టెన్ విగో గీతం విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. విమానం నిలిపిన ప్రదేశం నుంచి పైకి ఎగిరే వరకు మొత్తం ప్రక్రియను వివరించారు. విమానాన్ని నియంత్రించడం, ఎత్తులో ప్రయాణిస్తూ చేసే విన్యాసాలు, గాలిలో ఉండగానే ఇంజన్ ఆపి డిప్ స్టిక్ ల్యాండింగ్ చేయడం వంటివి చేసి చూపి, ఫ్లైట్ సిమ్యులేటర్ అనుభవాన్ని విద్యార్థులకు కల్పించారు.

తమ ఏరోనాటికల్ సొసైటీ ఆధ్వర్యంలో గీతం ఏరోస్పేస్ విద్యార్థులను ఎయిర్ ఇండియా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భారత వైమానిక దళం స్టేషన్ల సందర్శన ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అలాగే దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ సందర్శనతో పాటు అక్కడి పైలట్లతో ముఖాముఖి సంభాషణను కూడా ఏర్పాటు చేస్తామని, విమాన నియంత్రణ, ల్యాండింగ్ పద్ధతులు, పారాచూట్ ద్వారా అధిక వేగాన్ని తగ్గించి, సులువుగా ల్యాండింగ్ చేయడం వంటివి స్వయంగా చూసే ఏర్పాటు చేస్తామన్నారు. తొలుత, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎండీ.అక్తర్ ఖాన్ అతిథులను స్వాగతించి, ఈ రంగంలో పైలట్లు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి బాధ్యతలను వివరించారు. కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ ఎస్.కిషోర్ కుమార్ వందన సమర్పణతో ఈ కార్యశాల ముగిసింది.

admin

Recent Posts

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

2 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

4 days ago