మనవార్తలు ,రామచంద్రాపురం :
రామచంద్రపురం డివిషన్ లోని కానుకుంటా(పోలీస్ క్వాటర్స్ ముందు ఉన్న బస్తి) లో గత ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చిరకాల సీసీ రోడ్ సమస్య నేటితో ముగియనున్నది అని స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ తెలిపారు. గురువారం రోజు కానుకుంటా లో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి పర్యటించారు. త్వరలో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బస్తి వాసులకు తెలుపారు.సీసీ రోడ్ పనులు మంజూరు అయ్యాయని,రేపటి నుంచి సీసీ రోడ్ పనులు ప్రారంభించనున్నామని తెలిపారు.అలాగే మార్గ మధ్యలో ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయని,వెంటనే సీసీ రోడ్ పనులు ప్రారంభించముందే పోల్స్ తీసి లోపలకు జరపాలని ఆదేశించారు. ఎలక్ట్రిసిటీ ఎఈ సురేందర్, ఇంజనీరింగ్ ఎఈ ప్రభు,శ్రీనివాస్ రాజు, సత్తి రెడ్డి,సాయి,గౌస్,శ్యామ్,శ్రీను,రాజు,అసిఫ్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.