పటాన్ చెరు:
పటాన్ చెరు డివిజన్ పరిధిలోని నోవాపాన్ చౌరస్తా, పాత మార్కెట్, శ్రీ రామ్ నగర్ కాలనీల పరిధిలో జాతీయ రహదారి పై గల మురుగు నీటి సమస్యను వారం రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత అధికారుల కు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశించారు.
జిహెచ్ఎంసి, జాతీయ రహదారుల సంస్థ, రోడ్లు భవనాల శాఖ అధికారులు, స్థానిక కార్పొరేటర్ పెట్టు కుమార్ యాదవ్ తో కలిసి ఆయన స్వయంగా సమస్యలను పరిశీలించారు. వర్షాకాలంలో మురుగు నీటితోపాటు వర్షపు నీరు జాతీయ రహదారి పైకి చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు.
వచ్చే వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని ఇందుకోసం తన సొంత నిధులతో పైపులు కొనుగోలు చేసి అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే బాక్స్ డ్రైనేజి పైపులైను సైతం పూర్తి కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఆయా శాఖల అధికారులు సత్యనారాయణ, వెంకటరమణ, రామకృష్ణ, రవీందర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు