politics

24న పటాన్చెరులో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ విందు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని ఈ నెల 24వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఇఫ్తార్ విందు ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మతపెద్దల సూచనలకు అనుగుణంగా ఈ నెల 24వ తేదీన ఇఫ్తార్ విందు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదర సోదరీమణులందరూ భారీ సంఖ్యలో విందుకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. గత 25 సంవత్సరాలుగా రంజాన్ పురస్కరించుకొని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ముస్లింలకు తగు ప్రాధాన్యత అందించడంతోపాటు.. సొంత నిధులతో మసీదులు, ఆశిర్ఖానాలు నిర్మించి వారి ఆర్థిక అభ్యున్నతికి పాటుపాడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి, గుమ్మడిదల మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, ఎఎంసి మాజీ చైర్మన్ విజయ్ కుమార్, దశరథ్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, షేక్ హుస్సేన్, అఫ్జల్, లియాకత్, హమీద్, అజ్మత్, మోసీన్, మేరాజ్ ఖాన్, షకీల్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

4 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

4 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

4 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

2 weeks ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

2 weeks ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

2 weeks ago