Telangana

గూడెం కార్మికులకు ఆపన్న హస్తం

సాయిబాబా సెల్యులోజ్ పరిశ్రమలో గాయపడ్డ కార్మికుడికి అండగా ఎమ్మెల్యే జిఎంఆర్

ప్రమాదంలో కుడి చేయి కోల్పోయిన కార్మికుడు అమర్ సింగ్

యాజమాన్యంతో మాట్లాడి రూ.25 లక్షల పరిహారం అందచేత

భవిష్యత్తులో అండగా ఉంటానని భరోసా

ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కార్మిక నేపథ్యం నుంచి వచ్చిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.పటాన్ చెరు పారిశ్రామికవాడలో ఎక్కడ ప్రమాదం జరిగిన కార్మికుల పక్షాన నిలబడుతూ యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన పరిహారం అందిస్తూ కార్మిక పక్షపాతిగా నిలుస్తున్నారు.గతంలో అగర్వాల్ రబ్బర్ ఫ్యాక్టరీలో మరణించిన కార్మికుడికి 60 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఇప్పించిన తరహాలోనేఇదే రీతిలో పటాన్ చెరు లోని సాయిబాబా సెల్యులోజ్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ కార్మికుడికి ఆపన్న హస్తం అందించారు.గత శనివారం శ్రీ సాయిబాబా సెల్యులోస్ పరిశ్రమలో ప్రమాదవశాత్తూ అమర్ సింగ్ అనే కార్మికుడు (59) తీవ్రంగా గాయపడ్డాడు. మెషిన్ లో పడి కుడి చేయిని కోల్పోయాడు. దీంతో తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులతో పాటు కార్మికులు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఆశ్రయించారు.దీంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే గూడెం బాధిత కార్మికుడికి మెరుగైన చికిత్స అందించాలని ద్రువ ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. అనంతరం శ్రీ సాయి బాబా సెల్యులోజ్ పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి వారిని ఒప్పించి రూ.25 లక్షల పరిహారాన్ని ఇప్పించారు. బుధవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంపెనీ ప్రతినిధులతో కలిసి ఆర్థిక సహాయాన్ని అందించారు.భవిష్యత్తులోనూ అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం బాధిత కార్మికుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారాన్ని మర్చిపోలేమన్నారు. కార్మికుల పక్షాన నిలబడి సహాయం చేస్తున్న జిఎంఆర్ కు తామంతా రుణపడి ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజన్ సింగ్, ఆకుల శ్రీశైలం, పరిశ్రమ ప్రతినిధులు, బొందిలి సంక్షేమ సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago