కర్నూల్ లో అంబరాన్ని అంటిన వజ్రోత్సవ సంబరాల్లో 555 అడుగుల భారీ త్రివర్ణ పతాకం

Andhra Pradesh Districts

_ఉప్పొంగిన జాతీయ భావం.. మహనీయుల త్యాగాలను స్మరిస్తూ నినాదాలు

మనవార్తలు ,కర్నూలు:

స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల్లో భాగంగా 75 స్వాతంత్ర దినోత్సవాలను పూర్తిచేసుకుని 76వ సంవత్సరంలోని వెళ్తున్న సందర్భంగా కర్నూలులోని యువకులు డి.నిఖిల్ గౌడ్ నేతృత్వంలో 555 అడుగుల భారీ త్రివర్ణ పతాకాన్ని కర్నూలు డిఎస్పి కె.వి.మహేష్ భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధులు అహింసా మార్గంలో సాధించిన భారత స్వాతంత్రాన్ని నేడు మనం స్వేచ్ఛగా అనుభవిస్తున్నామని, అమరవీరుల త్యాగాన్ని నేటి యువకులు స్మరించుకుంటూ ఇలాంటి కార్యక్రమం చేయడం అభినందించదగిన విషయమని తెలిపారు. నేటి తరాలకు తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు. జాతీయ పతాక ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది విద్యార్థులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కర్నూలు పట్టణంలోని వివిధ కళాశాలల పాఠశాలలు ,విద్యార్థులు యువజన సంఘాల యువకులు, ప్రజా నాయకులు సంయుక్తంగా ఈ ర్యాలీలో పాల్గొని 555 అడుగులత్రివర్ణ పథకాన్ని కర్నూలు జిల్లా పరిషత్ గాంధీ విగ్రహ ఆవరణము నుండి కొండారెడ్డి బురుజు వరకు ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో పాల్గొని విజవంతం చేసిన ప్రతి ఒక్కరికి డి.నిఖిల్ గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

కర్నూల్ లో అంబరాన్ని అంటిన వజ్రోత్సవ సంబరాల్లో 555 అడుగుల భారీ త్రివర్ణ పతాకం
కర్నూల్ లో అంబరాన్ని అంటిన వజ్రోత్సవ సంబరాల్లో 555 అడుగుల భారీ త్రివర్ణ పతాకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *