_వందేళ్ళ ప్రగతిని పదేళ్లలో చేసి చూపించాం..
_గడపగడపకు అభివృద్ధి వివరించండి..
_పటాన్చెరులో పండగల బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంగా నిలిచిన పటాన్చెరు నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ది కాలంలో ప్రగతికి ప్రతీకగా తీర్చిదిద్దామని పటాన్చెరు శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.రాబోయే 20 రోజులు ప్రతి కార్యకర్త గడపగడపకు వెళ్లి పదేళ్ల ప్రగతిని వివరించి కారు గుర్తుపై ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయాలని కోరారు.సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో గురువారం ఉదయం 11 గంటలకు రుద్రారం గణేష్ గడ్డ దేవాలయంలో పూజలు నిర్వహించి నామినేషన్ వేయబోతున్నట్లు తెలిపారు.మతం పేరుతో రాజకీయాలు చేసే బిజెపి నాయకులు వాళ్ళ రాజకీయ జీవితంలో ఏనాడైనా ఒక గుడికి సున్నం వేశారా అని ప్రశ్నించారు.రంగురంగుల కరపత్రాలతో, మోసపూరిత హామీలతో మేనిఫెస్టోను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా మేనిఫెస్టోలోని హామీలను అమలు చేశారా అని ప్రశ్నించారు.పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటుచేసిన బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే జిఎంఆర్, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఓటు అడిగే నైతిక హక్కు కేవలం బిఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు. రాదనుకున్న తెలంగాణను 14 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో గత పది సంవత్సర కాలంలో 9000 కోట్ల రూపాయల నిధులతో పటాన్చెరును అభివృద్ధికి నిదర్శనం గా నిలిపామన్నారు.ప్రతి గ్రామంలో ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయించి ప్రజల అవసరాలు ఆకాంక్షల అనుగుణంగా అభివృద్ధి పనులు చేయడంతో పాటు ప్రతి ఇంట్లో పసి పిల్లనుండి పండు ముదుసలి వరకు సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు.ఎన్నికల ప్రచారం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు కులం మతం ప్రాంతం తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఏకగ్రీవ మద్దతు అందిస్తూ బిఆర్ఎస్ పార్టీని నిండు మనస్సుతో ఆశీర్వదిస్తున్నారని తెలిపారు.రాబోయే 20 రోజులు బిఆర్ఎస్ పార్టీ కోసం పని చేస్తే రాబోయే ఐదు సంవత్సరాలు మీ కష్టసుఖాలలో అండగా ఉంటానని తెలిపారు. లక్ష్య మెజారిటీ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు
.శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అటు రాష్ట్రంలో ఇటు పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల పరిగెత్తుతున్నాయని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 100% అమలు చేయడంతో పాటు ప్రజలు అడగని వాటిని సైతం అమలు చేసిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు. ప్రతి గడపకు పార్టీ హామీలను వివరించాలని కోరారు.మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నాయకులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని గత 40 సంవత్సరాలుగా చూస్తున్ననని.. నిరంతరం ప్రజల కోసం కష్టించే మనస్తత్వం ఆయనది అన్నారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తాను బిఆర్ఎస్ పార్టీలో చేరాలని తెలిపారు.మహిపాల్ రెడ్డి విజయం ఎప్పుడో ఖరారు అయిందని.. మెజార్టీయే మిగిలిందని అన్నారు.మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుత పటాన్చెరు నియోజకవర్గం మొత్తం బిఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉందని అన్నారు. రాబోయే 20 రోజులు ప్రతి కార్యకర్తకు అత్యంత కీలకమని, ప్రతి ఓటరుకు వ్యక్తిగతంగా కలిసి కారు గుర్తుకు ఓటు వేయాల్సిన ఆవశ్యకతను వివరించాలని కోరారు.అనంతరం బొల్లారం, పటాన్చెరు డివిజన్ సంబంధించిన వివిధ పార్టీల నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.