వైభవంగా టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర నాయకులు జన్మదిన వేడుకలు...
హైదరాబాద్:
టిఆర్ఎస్ కేవి రాష్ట్ర నాయకులు మహేష్ పాటిల్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పటాన్ చెరు పరిధిలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో జన్మదినం పురస్కరించుకొని మొక్కలు నాటారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కు ధరించి, అత్యవసరమైతే బయటకు రావాలన్నారు.కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న 18 మంది ఆటోడ్రైవర్లకు 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి కోరారు. కుటుంబ సభ్యులతో కలిసి తన జన్మదినం పురస్కరించుకొని ఆటోడ్రైవర్లకు నిత్యావసర సరుకులు అందజేయడం సంతోషంగా ఉందన్నారు.