పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ ప్రభుత్వం జూనియర్ పంచాయతి కార్యదర్శులను భయబ్రాంతులకు గురిచేయడం మానుకోవాలని మెట్టు శ్రీధర్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వారి కాలపరిమితి పూర్తైనా రెగ్యులరైజ్ చేయకపోవడం భాధకరమని వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోగా టర్మినేషన్ చేస్తామని ప్రభుత్వం హెచ్చరించడం సరికాదని మెట్టు శ్రీధర్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నవభారత్ నిర్మాణ్ యువసేన తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు.