_దేశానికే రోల్ మోడల్ తెలంగాణ
_ప్రతిపక్షాల చౌకబారు ప్రచారాన్ని తిప్పి కొట్టండి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తున్నాయని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
మంగళవారం పాటి ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ మండల స్థాయి ఆత్మీయ సమ్మేళన సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన గురుతర బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ప్రతి గ్రామంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు సిఎస్ఆర్ నిధులతో ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
ఎన్నికల సీజన్ మొదలు కావడంతో ప్రతిపక్ష పార్టీలు కల్ల బొల్లి కబుర్లు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని, పార్టీ కార్యకర్తలు అందరూ సైనికుల వలె తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఓటు అడిగే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులను పార్టీ కార్యకర్తలు నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు బేగరి పాండు, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి వెంకట్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పాలక వర్గం ప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.