జర్నలిస్టులకు నిత్యవసర సరుకులు పంపిణీ…

Hyderabad

జర్నలిస్టులకు నిత్యవసర సరుకులు పంపిణీ…

పటాన్ చెరు:

జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించాలని సామాజిక ఉద్యమ సేవ కార్యకర్త ఎట్టయ్య డిమాండ్ చేశారు.సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు పట్టణ పరిధిలోని ఫ్రింట్ ,ఎలక్ట్రానిక్ మీడియాల విలేకరులకు నిత్యావసర సరుకులు అందించారు . అనంతరం జలగారి ఎ ట్టయ్య మాట్లాడుతూ…..

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సేవ చేయడంలో డాక్టర్లు ఆశా వర్కర్లు పోలీసు వాళ్లు వీరు తమ ప్రాణాలకు పణంగా పెట్టి సేవ చేస్తూ ఉంటే వీరికి సపోర్టుగా విలేకరులు కష్టపడుతున్నారని తెలిపారు. కరోనాపై ప్రజలను అప్రమత్తం చేస్తున్న విలేకరుల ను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రభుత్వం గుర్తించాలన్నారు. విలేకరుల ను చేసిన సేవలు పేపర్ రూపంలో గానీ టీవీల రూపంలో గాని ప్రజలకు తెలియజేస్తూ నిరంతరం వీరి ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్నారు .ఈ మధ్య చాలామంది రిపోర్టర్లు కరోనాతో మృతి చెందడం చాలా బాధాకరమన్నారు.సామాజిక ఉద్యమ సేవా కార్యకర్త జలగరి ఎ ట్టయ్య మదర్స్ డే సందర్భంగా వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం (అమ్మ జలగారి లచ్చమ్మ, తండ్రి జలగరి చెన్నయ్య ) కొంతమంది విలేకర్లకు నిత్యావసరాల పంపిణీ చేశారు . 25 కేజీల బియ్యం, 5 కిలోల మంచినూనె,  ఇవ్వడం జరిగింది అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *