మనవార్తలు ,పటాన్ చెరు:
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరిలో దేశభక్తిని చాటేలా భారీ జాతీయ జెండా ప్రదర్శన చేసినట్లు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు 75 సంవత్సరాల భారత స్వతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా చిట్కుల్ అంబేద్కర్ విగ్రహం నుంచి బయలుదేరి గ్రామ రహదారి నుంచి జాతీయ రహదారి మీదుగా ఇస్నాపూర్ చౌరస్తా వరకు చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ నేతృత్వంలో ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో తిరంగా యాత్రలో భాగంగా 750 మీటర్ల జాతీయ పతాకాన్ని విద్యార్థులు పట్టుకుని దేశభక్తికి సంబంధించిన నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ మినీ ఇండియాగా పేరుగాంచిన పటాన్ చెరు నియోజకవర్గంలో అన్ని రాష్ట్రాలకు చెందినవారు ఇక్కడే ఉంటున్నారని, వారందరిలో వజ్రోత్సవాల సందర్భంగా ఐక్యతా స్ఫూర్తిని నింపేలా 750 మీటర్లు జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామస్థాయి నుండి అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు దేశంలో ఎవరూ అమలు చేయలేని విధంగా అమలు చేస్తున్నారన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ రైతుబంధు, రైతు బీమా, దళితుల కోసం దళిత బంధు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి పథకాలు ఇచ్చి పెద్ద దిక్కుగా నిలుస్తున్నాడని చెప్పారు. ఆగస్టు 15 న 48 అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశానికి మహనీయులు స్వాతంత్రం తెచ్చినట్లే తెలంగాణకు స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ మహిపాల్ రెడ్డి, ఎంపీడీఓ బాన్సిలర్, ఎంపీఓ హరిశంకర్, ఈఓ కవిత, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, కృష్ణ, వెంకటేష్, భుజంగం, శ్రీను, మురళి, రాజ్ కుమార్, నర్సింగ్, ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ నారాయణరెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు వి. నారాయణరెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ప్రశాంత్, గోపాల్, వెంకటేష్, అనిల్, శీను, గారెల మల్లేష్, నారబోయిన శ్రీనివాస్, ప్రభు, వంశీ, చంటి, సతీష్, మహేష్, నవీన్ రాజ్, శ్రీకాంత్ గౌడ్, గ్రామ పెద్దలు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, యువజన సంఘాలు, డ్వాక్రా మహిళలు, ఆశా వర్కర్లు, పటాన్ చెరు నియోజకవర్గ ఎన్ ఎం ఆర్ యువసేన సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.