జేఈఈ మెయిన్స్ లో మెరిసిన శ్రీ వెంక‌టేశ్వ‌ర కళాశాల విద్యార్థి

Andhra Pradesh Districts

మనవార్తలు ,నంద్యాల :

మొన్న వెలుబ‌డిన జేఈఈ మెయిన్స్ ప‌రీక్ష ఫ‌లితాల్లో శ్రీ వెంక‌టేశ్వ‌ర కళాశాలకు చెందిన విద్యార్థి 93.33 శాతం మార్కులు సాధించి నంద్యాల టౌన్ లో రెండ‌వ స్థానాన్ని సాధించాడ‌ని క‌ళాశాల డైరెక్ట‌ర్లు ఎం.చంద్ర‌మౌళిశ్వ‌ర్ రెడ్డి, ఆర్ఎస్ఎల్ రంగారావులు తెలిపారు. ఎస్సీ కేట‌గిరిలో రాజుకు ఆల్ ఇండియా ర్యాంకులో ఐదు వేల నుంచి ఆరువేల మ‌ధ్య‌లో రావ‌చ్చ‌ని వారు వెల్ల‌డించారు. స‌బ్జెక్ట్ ల వారిగా హెచ్ టీ ఏ స్కోర్ ఫిజిక్స్ లో 92.74శాతం,కెమిస్ట్రీలో 92.31 శాతం మ్యాథ్స్ లో 88.36 శాతం సాధించి మొత్తం93.33 శాతం సాధించిన‌ట్లు తెలిపారు. క‌ళాశాల పేరు ప్ర‌తిష్ట‌ల‌ను ద‌శ‌దిశ‌లా వ్యాప్తి చేసిన క‌డియం రాజును క‌ళాశాల యాజమాన్యం ఘ‌నంగా స‌త్క‌రించింది. ఆల్ ఇండియా టాప్ ఎన్ఐటీ క‌ళాశాల‌లో సీటు సాధించే అర్హ‌త‌ను సాధించినందుకు రాజుకు అభినంద‌నలు తెలిపారు .

మొద‌టి నుంచి నిష్ణార్థులైన అధ్యాప‌కుల‌చే కోచింగ్ ఇవ్వ‌డం వ‌ల్ల ఈ విజ‌యం సాధ్య‌మైంద‌ని చంద్ర‌మౌళీశ్వ‌ర్ రెడ్డి తెలిపారు. ఈ ఫ‌లితాలు సాధన‌కు కృషి చేసిన క‌ళాశాల అధ్యాప‌కుల‌కు ఈ సంద‌ర్భంగా అభినంద‌నలు తెలిపారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే జేఈఈ అడ్వాన్స్ ఫ‌లితాల్లో ఉత్త‌మ ర్యాంకులు సాధిస్తామ‌ని యాజ‌మాన్యం ఆశాభావం వ్య‌క్తం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *