_వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ మహారాజ్
మనవార్తలు ,పటాన్ చెరు:
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రజా సంక్షేమం కోసం తన పరిపాలనలో అనుసరించిన విధానాలు నేటి తరానికి అనుసరణీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలోని రామేశ్వరం బండ చౌరస్తాలో శివాజీ విగ్రహం ఏర్పాటు కోసం నిర్వహించిన భూమిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పోరాటయోధుడే కాకుండా మంచి పరిపాలనాదక్షుడు అని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం వినూత్న పథకాలను ప్రవేశపెట్టిన మహనీయుడు అని అన్నారు. తన వీరత్వం తో యువతరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇంద్రేశం గ్రామ సర్పంచ్ నర్సింలు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, అంతి రెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.