మనవార్తలు ,శేరిలింగంపల్లి
ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ప్రాణాలు కాపాడాలని ఆషియా ఫాండేషన్ వారు తెలిపారు చందానగర్ డివిజన్ లోని పీజేఆర్ స్టేడియంలో ఆషియా ఫాండేషన్ వారు ఏర్పాటు చేసిన రక్తదానం శిభిరాన్ని కి ముఖ్య అతిధిగా ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ పాల్గొని ప్రారంభించారు .ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఆషియా ఫాండేషన్ వారు రక్తదాన శిభిరాన్ని ఎర్పాటు చేయడం చాలా సంతోషకరమని అన్నారు .అన్ని దానాల్లో కెల్లా రక్తదానం చాలా గొప్పదని ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో తప్పకుండా రక్తదానం చేయాలని మీరు ఇచ్చే రక్తదానం వల్ల ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారని విప్ గాంధీ పేర్కొన్నారు. రక్తదానం శిభిరాన్ని నిర్వహించిన ఆషియా ఫాండేషన్ వారికి ప్రత్యేక కృతఞతలు తెలిపారు .ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన యువతకి అజయ్ వారి మిత్ర బృందాన్ని మరియు ఎమ్ఎన్ జె వైద్య సిబ్బందిన్ని ప్రత్యేకంగా అభినందించారు.రక్త దానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని రక్త దానం చేసిన వారికి ఎమ్ఎన్ జె వైద్య సిబ్బంది సర్ట్ఫికెట్ ను అందించారు .