మనవార్తలు ,పటాన్చెరు
నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు పట్టణానికి చెందిన సాయి కిరణ్గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా సీఎంఆర్ఎఫ్ కి దరఖాస్తు చేసుకోగా రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్వోసీ మంజూరైంది. ఈ మేరకు బుధవారం ఉదయం సాయి కిరణ్ కుటుంబ సభ్యులకు ఎల్వోసీ అనుమతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, గూడెం మధు సూధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.