రామగిరి మండలం :
మండలకేంద్రం సాయిరాం గార్డెన్ లో మంథని నియోజకవర్గ ఇంచార్జ్ , పెద్దపల్లి జిల్లా జడ్పిచైర్మన్ పుట్ట మధూకర్ గారి ఆదేశానుసారం టీఆర్ఎస్ పార్టీ రామగిరి మండలశాఖ అధ్యక్షులు శంకేసి రవీందర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు రామగిరి మండలంలో అన్ని గ్రామాలకు నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ , యూత్,బీసీ,ఎస్సీ అధ్యక్షులు సమావేశానికి ముఖ్య అతిధిగా కమాన్ పూర్ కమిటీ చైర్మన్ పూదరి గారు,ఎంపిపి అరెల్లి దేవక్క-కోమురయ్య, జెడ్పీటీసీ మ్యాదరవేన శారధ-కుమార్, వైస్ ఎంపిపి కాపరబోయిన శ్రీదేవి-భాస్కర్ హాజరయ్యారు.
మండల అధ్యక్షుడు శంకేసి రవీందర్ మాట్లాడుతూ క్రమశిక్షణతో టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కృషిచేయాలని కోరారు .ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామశాఖ మరియు యూత్ అధ్యక్షుల పరిచయ కార్యక్రమం చేసిన అనంతరం ఎన్నికైన నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు , రానున్న రెండేళ్లు కీలకమైన రోజులని , ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడప గడప కు తీసుకెళ్లాలని అన్నారు , వర్గవిబేధాలు లేకుండా అందరూ సమన్వయం తో ముందుకు వెళ్లాలని కోరారు , ప్రజలకు , కార్యకర్తలకు అందుబాటులో ఉండి పార్టీ కార్యక్రమాల సమాచారం అందించాలన్నారు .