పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్..

politics Telangana

ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, విజయాలు వెల్లివిరియాలి.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్‌చెరులో అద్భుత ప్రగతి..

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

చెడుపై మంచి, అధర్మంపై ధర్మం, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినం సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలందరికీ స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ కెసిఆర్ గారి నాయకత్వంలో పటాన్‌చెరు నియోజకవర్గ అద్భుతమైన ప్రగతి పథంలో ముందుకు వెళ్లిందని తెలిపారు. దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలను చిగురింపజేస్తూ, ఆనందం, ఆత్మవిశ్వాసం, విజయాలకు నాంది పలకాలని ఆయన ఆకాంక్షించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, చెడు ఎంతటి శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచికే దక్కుతుందనే గొప్ప సందేశాన్ని విజయదశమి మనకు అందిస్తుందని పేర్కొన్నారు.ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు విరజిమ్మాలి ప్రతి కుటుంబంలో సిరిసంపదలు వెల్లివిరియాలి ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలు సొంతం కావాలి అని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని, కుటుంబాల మధ్య ప్రేమానురాగాలు, సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత బలపడాలని కోరుకున్నారు.ప్రజల ఆశయాలు నెరవేరి, ప్రతి ఒక్కరి జీవితంలో అభివృద్ధి, సంక్షేమం, సంతోషం నిండాలని ఆకాంక్షిస్తూ పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి విజయదశమి పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే జిఎంఆర్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *