పటాన్‌చెరులో విజయవంతంగా ముగిసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

politics Telangana

– ముత్తంగి డివిజన్ కాంగ్రెస్ నాయకులు రాధా కృష్ణ హరిపంతులు

– ముత్తంగి డివిజన్‌లో ముమ్మరంగా కార్యక్రమం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమామే ధ్యేయంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పటాన్‌చెరు నియోజకవర్గంలో విజయవంతంగా ముగిసిందని ముత్తంగి డివిజన్ కాంగ్రెస్ నాయకులు రాధా కృష్ణ హరిపంతులు పేర్కొన్నారు. ముత్తంగి డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు సోమవారం స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదవాడికి చేరాలనే లక్ష్యంతో కాటా శ్రీనివాస్ గౌడ్, పార్లమెంటు ఇంచార్జి నీలం మధు నాయకత్వంలో నిరంతరం శ్రమిస్తున్నామని చెప్పారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారడమే కాకుండా, ప్రజలకు సరుకుల అందజేత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు మరియు సహకరించిన డివిజన్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ముత్తంగి డివిజన్ కాంగ్రెస్ నాయకులు అశోక్ ముదిరాజ్, వాలిదాస్ గోపాల కృష్ణ, ఎల్లగారి ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి, మహేందర్, కమ్మరి శ్రీనివాస్ చారి, రంజిత్ మరియు మహిళా విభాగ ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *