చికెన్ షాప్ ను ప్రారంభించిన తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సోమిరెడ్డి

politics Telangana

మనవార్తలు ప్రతినిధి ,తెల్లాపూర్ :

తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కేసీఆర్‌ నగర్ ఫేజ్‌–2, కాంప్లెక్స్‌–3లో పాషా ఆహ్వానం మేరకు షాప్‌ నంబర్‌ -80లో సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహించిన చికెన్‌ షాప్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి మరియు డివిజన్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ హాజరయ్యారు.అదేవిధంగా డివిజన్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ తో కలిసి కేసీఆర్‌ నగర్‌లోని పలువురు స్థానికులను సోమిరెడ్డి పరామర్శించారు. 26వ బ్లాక్‌కు చెందిన శ్రీనివాస్ చారి ఇటీవల నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల దాడికి గురైన అజయ్, పాండు నివాసాలకు వెళ్లిన సోమిరెడ్డి వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌ నగర్ ఫేజ్‌–2 బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *