బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

politics Telangana

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేసినట్లు హరీష్ రావు అన్నారు పటాన్‌చెరు మండల బీఆర్ఎస్ ఇన్‌చార్జ్, మాజీ జెడ్పీటీసీ శ్రీ గడీల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో పటాన్‌చెరు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి తో మరియు పటాన్ చెరు మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్తో కలిసి మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు ని కోకాపేట లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు, చిట్కుల్ గ్రామ అభివృద్ధి, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేసినట్లు తెలిసింది. త్వరలోనే పలువురు చిట్కుల్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ఈ సందర్భంగా సంకేతాలు వెలువడ్డాయి.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పటాన్‌చెరు నియోజకవర్గ అభివృద్ధి, చిట్కుల్ గ్రామ ప్రజల సంక్షేమం కోసం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న ప్రజా ఉద్యమాలు, ప్రజల సమస్యలపై పార్టీ నాయకత్వం చేస్తున్న పోరాటం పట్ల ఆకర్షితులై పలువురు నాయకులు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.త్వరలో చిట్కుల్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు నాయకులు వెల్లడించారు. ఈ పరిణామం పటాన్‌చెరు నియోజకవర్గ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో చిట్కుల్ గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు వల్లెపు వెంకటేష్ ,రాజ్ కుమార్ ,మురళి యాదవ్ గారు,మరియు కాంగ్రెస్ నాయకులు మడగుల సంతోష్ ,మంజలి శ్రీను గారు,వల్లెపు రాయుడు ,భీమ గారు,యాది గారు,మాడుగుల వెంకట్, ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్స్ తలారి ఆంజనేయులు ,బేగరి వెంకటేష్ ,కో ఆప్షన్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి ,గుండారపు సంపత్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *