మనవార్తలు ప్రతినిధి,సంగారెడ్డి :
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచందర్ రావు ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి వివిధ సెల్ లకు కన్వీనర్లను నియమించారు. ఇందులో భాగంగా పటాన్‌చెరువుకు చెందిన బిజెపి సీనియర్ నాయకులు కంజర్ల కృష్ణమూర్తి చారిని సంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ గా నియమించారు. ఈ సందర్భంగా కంజర్ల కృష్ణమూర్తి చారి మాట్లాడుతూ తనకు ఈ పదవిని ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచందర్ రావుకి, మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు కి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ శ్రీ అంజిరెడ్డి కి, మరియు జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు .సంగారెడ్డి జిల్లా మరియు పటాన్చెరు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు తనకు ఇచ్చిన సంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ బాధ్యతలను సమర్థవంతంగా మరియు పార్టీ అభివృద్ధి చెందే విధంగా నిర్వహిస్తానని, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలను పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని కృష్ణ మూర్తి చారి తెలిపారు
