విశ్వశాంతి కోసం పాదయాత్ర చేపట్టడం అభినందనీయం

politics Telangana

19వ వీరశైవ లింగాయత్ సమాజం పాదయాత్ర ను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

విశ్వశాంతి కోసం వీరశైవ సమాజం ఆధ్వర్యంలో పటాన్‌చెరు నుండి బొంతపల్లి వీరభద్ర స్వామి దేవస్థానం వరకు ప్రతి సంవత్సరం పాదయాత్ర చేపట్టడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్‌చెరు వీరశైవ సమాజం ఆధ్వర్యంలో పటాన్‌చెరు పట్టణంలోని ఉమామహేశ్వర దేవాలయం నుండి బొంతపల్లి వీరభద్ర స్వామి దేవాలయం వరకు చేపట్టిన 19వ మహా పాదయాత్రను ఆదివారం ఉదయం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ 12వ శతాబ్దంలో అభ్యుదయ సమాజం కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా బసవేశ్వరుడి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు. 19 సంవత్సరాలుగా పాదయాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. నియోజకవర్గంలోని వీరశైవుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సపాన దేవ్, మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నాగేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు ఉపేందర్, నర్రా బిక్షపతి, పృథ్వీరాజ్, వెంకటేష్, వీరశైవ సమాజం ప్రతినిధులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *