వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేసీఆర్‌ను కలిసిన ఆర్‌కే లక్ష్మి

politics Telangana

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం:

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని ముందుండి నడిపి, రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌)ను సంగారెడ్డి జిల్లా హ్యూమన్‌ రైట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్‌ చైర్మన్‌, ఆర్‌ఆర్‌కే ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ ఆర్‌కే లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు.తన 20వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. రామచంద్రపురం 268 డివిజన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున నిర్వహిస్తున్న ‘బస్తీ దర్శన్‌’ కార్యక్రమం గురించి కేసీఆర్‌కు వివరించారు. డివిజన్‌లో ప్రజలను నేరుగా కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 268 డివిజన్‌లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇదే స్ఫూర్తితో కష్టపడి పనిచేయాలని కేసీఆర్‌ సూచించినట్లు ఆర్‌కే లక్ష్మి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *