మాదాపూర్‌లో పకోడా హబ్‌ను ప్రారంభించిన సినీనటుడు వెంకట్

Hyderabad Lifestyle Telangana

మనవార్తలు ప్రతినిధి,హైదరాబాద్:

ఫుడ్ లవర్స్‌కు సరికొత్త రుచులను పరిచయం చేస్తూ మాదాపూర్‌లో మరో ప్రత్యేకమైన ఫుడ్ డెస్టినేషన్ అందుబాటులోకి వచ్చింది. వేడివేడిగా తయారుచేసి, కరకరలాడే క్రిస్పీ టెక్స్చర్‌తో పాటు మసాలా, స్పైసీ ఫ్లేవర్స్‌తో నోరూరించే వంటకాలను అందించే పకోడా హబ్ రెస్టారెంట్ తాజాగా ప్రారంభమైంది. దుర్గం చెరువు మెట్రో స్టేషన్ కింద, మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ను ఆదివారం సినీనటుడు వెంకట్ ప్రారంభించారు.పకోడా హబ్‌లో ప్రతి బైట్‌లోనూ క్రిస్పీ టెక్స్చర్, మసాలా ఫ్లేవర్, స్పైసీ టచ్ ఉండేలా ప్రత్యేకంగా మెనూను రూపొందించినట్లు సినీనటుడు వెంకట్ తెలిపారు. ఫ్రెష్ పదార్థాలను ఉపయోగించి, ఆర్డర్ చేసిన వెంటనే వేడివేడిగా తయారు చేసి సర్వ్ చేయడం రెస్టారెంట్ ప్రత్యేకత అన్నారు. బయటకు గోల్డెన్ క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉండేలా తయారు చేసే స్టార్టర్స్ ఫుడ్ లవర్స్‌ను తప్పకుండా ఆకట్టుకుంటాయని చెప్పారు.

పకోడా హబ్ నిర్వహకులు శరత్ చంద్ర మాట్లాడుతూ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతూ వేడివేడి స్నాక్స్ ఆస్వాదించాలనుకునే వారికి పకోడా హబ్ మంచి ఎంపికగా నిలుస్తుందని తెలిపారు. సాధారణ స్నాక్స్‌కు భిన్నంగా స్పైసీ, ట్యాంగీ, క్రిస్పీ ఫ్లేవర్స్‌తో ప్రత్యేకమైన రుచిని అందించడమే తమ లక్ష్యమన్నారు.ఇక్కడి మెనూలో చికెన్ పకోడా, పనీర్ 65, మష్రూమ్ పకోడా, క్రీమీ చికెన్, లూస్ ప్రాన్స్ వంటి నోరూరించే వంటకాలతో పాటు మరెన్నో స్పెషల్ స్నాక్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా వేడివేడిగా కరకరలాడే క్రిస్పీ బైట్స్ ఘుమఘుమలాడే మసాలా సరైన స్పైసీ కిక్ కలిసిన ఈ వంటకాలు ఫుడ్ లవర్స్‌కు కొత్త టేస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తున్నాయని అన్నారు.ఒక్కసారి టేస్ట్ చేస్తే మరోసారి రావాలనిపించేలా “క్రిస్పీ బైట్ స్పైసీ కిక్ ఫుల్ టేస్ట్” పకోడా హబ్ ప్రత్యేకతగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. మాదాపూర్‌లో స్నాక్స్ ప్రియులకు కొత్త రుచుల గమ్యస్థానంగా పకోడా హబ్ నిలవనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *