మనవార్తలు ప్రతినిధి,తెల్లాపూర్:
తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేస్-02లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మెయిన్ గేట్‌తో పాటు బ్లాక్ 86 నుంచి 102 వరకు వివిధ బ్లాక్ లలో జాతీయ జెండాలను ఎగురవేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లేపల్లి లలిత సోమిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, దేశ ఐక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ నగర్ ఫేస్–01 బీఆర్ఎస్ నాయకుల ద్వారా పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత విషయాన్ని తెలుసుకున్న సోమిరెడ్డి విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు విద్యా వాలంటీర్‌ను నియమించడంతో పాటు పాఠశాల అభివృద్ధి కోసం రూ.50,000 ఆర్థిక సహాయాన్ని ప్రధానోపాధ్యాయులు ప్రదీప్ కుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, దయాకర్ రెడ్డి, ఇంద్రారెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ నగర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
