యండిఆర్ ఫౌండేషన్ కు 23వ జాతీయ అవార్డు

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

సామాజిక సేవ కార్య‌క్ర‌మాల నిర్వ‌హిస్తున్న ఎండీఆర్ ఫౌండేష‌న్ ఖాతాలో మ‌రో అవార్డు ద‌క్కింది . ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మిత్ర నేషనల్ అవార్డ్స్ – 2026 చాలా సంతోషంగా ఉందని యండిఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ శ్రీ మాద్రి పృథ్వీరాజ్ తెలిపారు .హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించిన అవార్డు వేడుకకు హర్యానా మరియు హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతల మీదుగా అవార్డ్ ను అందుకున్నారు . పటాన్‌చెరు కేంద్రంగా గత ఎన్నో సంవత్సరాలుగా యండిఆర్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న అనాధ శవాల అంత్యక్రియలు, పేదలకు ఆర్థిక సహాయం, విద్యార్థులకు విద్యా ప్రోత్సాహం, వైద్య సహాయం, రేషన్ కిట్ల పంపిణీ, సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా యండిఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, యండిఆర్ ఫౌండేషన్‌కు లభించిన 23వ జాతీయ అవార్డును గౌరవంగా స్వీకరిస్తున్నామని , ఇది మా సేవా బాధ్యతను మరింత పెంచింది. ప్రజల ఆశీర్వాదాలు, సహకారంతో మున్ముందు కూడా మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం” అని తెలిపారు.సేవే లక్ష్యంగా సమాజ హితం కోసం యండిఆర్   ఫౌండేషన్ ప్రయాణం నిరంతరం కొనసాగుతుందిని తెలిపారు . ఈ కార్యక్రమంలో యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణు  , జాతీయ చైర్మన్ డా. యామినేని ఉప్పలరావు , సినీ నటి పూజిత జొన్నలగడ్డ ,అంతర్జాతీయ మోడల్ ఆశ్రిత రొయ్యూరు తదితర పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *