అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

కార్మికులకు చట్టబద్ధంగా రావలసిన సౌకర్యాలు, యజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తూ హక్కులు కల్పించకుండ పేరుకే బిస్లరీ కంపెని చెప్పుకునేది ఇంటర్నేషనల్ బ్రాండెడ్ గా యజమాన్యం వ్యవహరిస్తుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం ఆరోపించారు. పాశమైలారం పారిశ్రామిక వాడ లో గల బిస్లరీ ఇంటర్నేషనల్ పరిశ్రమ కార్మికులు తమ హక్కుల కోసం చేస్తున్న సమ్మె మూడవరోజు చేరుకుంది. ఈ సందర్భంగా బీరం మల్లేశం సమ్మెలో ఉన్న కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ పేరుకే బిస్లరీ కంపెనీ యాజమాన్యం ఇంటర్నేషనల్ బ్రాండెడ్ అని చెప్పుకుంటుందని, కార్మికులకు చట్టబద్ధంగా రావలసిన సౌకర్యాలు, హక్కులు కల్పించకుండం లేదని, చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే యాజమాన్యం నిరంకుశంగా కార్మికులను తొలగించిందని మండిపడ్డారు. పూర్తిగా కార్మిక వ్యతిరేక చర్యని చట్టానికి విరుద్ధమన్నారు. యూనియన్ పెట్టుకున్నారనే సాకుతో తొలగించారని, తొలగించిన కార్మికులను తీసుకోవాలంటు 8నెలలుగా చట్టబద్ధంగా శాంతియుతంగా ఆందోళన చేశామన్నారు. కానీ యాజమాన్యం స్పందించకుండా కార్మికులను కక్ష సాధింపులకు పాల్పడుతూ బెదిరిస్తూ దౌర్జన్యాల దిగిందన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేదా బిస్లరి కార్మికుల పోరాటానికి సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న పోరాటానికి సిఐటియు అండగా నిలుస్తుందన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాపాడవలసిన కార్మిక శాఖ అధికారులు యాజమాన్యాల తొత్తుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. బిస్లరీ కార్మికులు ఐక్యంగా ఉండి పోరాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సుధాకర్ రాజు పాల్గొన్నారు.

బిస్లరీ కార్మికుల సమ్మెకు వివిధ కార్మిక సంఘాల మద్దతు

సంగారెడ్డి జిల్లా కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సురేష్, యుబి నైజం జనరల్ సెక్రెటరీ వెంకట్ రెడ్డి, కిర్బి చీపు వైస్ ప్రెసిడెంట్ తలారి శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ శ్యాంబాబు, పార్లేఆగ్రో జనరల్ సెక్రెటరీ సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *