పటాన్ చెరు:
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్, పటాన్ చెరు జడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పోచారం, ఐనోల్, చిన్న కంజర్ల, పెద్ద కంజర్ల గ్రామాలలో జడ్పీ వైస్ చైర్మన్, జెడ్పిటిసి, ఎంపీపీ లు 7వ విడత హరితహారం, 4వ విడత పల్లె ప్రగతి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో హరితహారంలో భాగంగా వారు మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మొక్కలు నాటాలని సూచించారు.
నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత మన పైనే ఉందని తెలిపారు. మొక్కలు నాటడం వలన భావితరాల మంచి వాతావరణం అందించిన వాళ్ళము అవుతామని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సలహా సూచనలతో మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా గ్రామంలో ప్రజలందరూ ఐక్యంగా ఉంటూ గ్రామాల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బన్సీలాల్ స్పెషల్ ఆఫీసర్ సతీష్, ఈఓలు భవానీ, సుభాష్,వార్డు సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
