ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్, ఆటోమేషన్ పై శిక్షణ

Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో జనవరి 19 నుంచి 23 వరకు ‘ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్, ఆటోమేషన్’ పై ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో అధ్యాపకులు, విద్యార్థులు వాస్తవ-ప్రపంచ సెన్సార్ ఇంటర్ ఫేసింగ్ ను ఆచరణాత్మకంగా నేర్చుకుంటున్నారు.స్మార్ట్ ఎనర్జీ మానిటరింగ్ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ గేట్ వే సొల్యూషన్స్ వంటి అప్లికేషన్లను అభివృద్ధి చేయడంలో ఈ నైపుణ్యాలను ఉపయోగిస్తారు. అంతేగాక, జాతీయ విద్యా విధానం 2023కు అనుగుణంగా పాఠ్యాంశాలను మెరుగుపరచడం, ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం, ఆవిష్కరణలపై నైపుణ్యం-ఆధారిత విద్యకు ఈ శిక్షణ ఉపకరించనుంది.బెంగళూరులోని పైటెక్ టెక్నికల్ మేనేజర్ గోపాల్, ఎంబెడెడ్ సాఫ్ట్ వేర్ డెవలపర్ హరీష్ ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, ఈఈసీఈ అధ్యాపకులు, విద్యార్థులు ఇందులో చురుకుగా పాల్గొంటున్నారు.పైటెక్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సింగ్, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి పర్యవేక్షణలో, డాక్టర్ పి.వి. రామకృష్ణ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *