పటాన్చెరులో ఘనంగా ప్రారంభమైన 36వ మైత్రి క్రికెట్ కప్ పోటీలు
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
నేటి తరం యువత క్రీడల పై ఆసక్తి పెంపొందించుకోవాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. క్రికెట్ అభివృద్ధికి మైత్రి క్రికెట్ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో మైత్రి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 36వ మైత్రి క్రికెట్ ట్రోఫీని సోమవారం ఉదయం లాంచనంగా ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర కలిగిన మైత్రి మైదానాన్ని క్రీడారంగానికి కేంద్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. మూడు సంవత్సరాల క్రితం 7 కోట్ల 50 లక్షల రూపాయలతో ఆధునిక వసతులతో మైదానాన్ని తీర్చిదిద్దామని తెలిపారు. గత 36 సంవత్సరాలుగా ప్రతి ఏటా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న ఘనత మైత్రి క్రికెట్ క్లబ్ కి దక్కిందని తెలిపారు. నియోజకవర్గంలో క్రీడల పైన ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న క్రీడాకారులకు. అండగా ఉంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పారిశ్రామికవేత్తలు కే. సత్యనారాయణరెడ్డి, సి. సత్యనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ సపాన దేవ్, సిఐ వినాయక్ రెడ్డి, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత రెడ్డి, కబడ్డీ జాతీయ క్రీడాకారుడు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, నర్రా బిక్షపతి, ఇక్బాల్, శ్రీధర్ చారి, పృథ్వీరాజ్, వెంకటేష్, ఎల్లయ్య, గిరి, సంజీవ రెడ్డి, మైత్రి క్రికెట్ క్లబ్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
