ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ కలయిక

politics Telangana

– బిఆరెస్ పార్టీ రజతోత్సవాన్ని విజవంతం చేయాలనీ పిలుపు

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :

బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ నెల 27న వరంగల్ లో నిర్వహించనున్న పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని బిఆరెస్ నేతలు అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ కలయిక సమావేశం మియాపూర్ లోని శేరిలింగంపల్లి సీనియర్ సీనియర్ నాయకులు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మరియు వివేకానంద నగర్ కార్పొరేటర్ రోజాదేవి రంగా రావు ల ఆధ్వర్యంలో మియాపూర్ లోని అతిధి ఫంక్షన్ హాల్ లో గురువారం రోజు అనగా గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఉద్యమకారులు నాయకులు ప్రతి ఒక్కరు హాజరైన సందర్బంగా భాగంగా సాయిబాబా మరియు రోజాదేవి లు మాట్లాడుతూ ఏప్రిల్ 27 న జరగనున్న బిఆర్ఎస్ పార్టీ రాజతోత్సవ సభకు ప్రతి డివిజన్ నుండి ముఖ్య నాయకులు, ప్రతి కార్యకర్త హాజరై సభను విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరారు. నాయకులు పోయినంత మాత్రానా పార్టీ బలహీన పడలేదనీ, క్షేత్ర స్థాయిలో పటిష్టంగా ఉందని తెలిపారు. ఉద్యమం నుండి మొదలైన రాజకీయ పార్టీ మళ్ళీ అదే ఉద్యమం ల మొదలై పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మారబోయిన రవి యాదవ్, పురుషోత్తం యాదవ్, మిద్దేల మల్లా రెడ్డి, రోజా కలధిండి, హరీష్ రావు, రవీందర్ యాదవ్, సీమల రమేష్ కురుమ, బాబు మోహన్ మల్లేష్, శ్రీకాంత్, శ్రీనివాస్ గౌడ్, రామకృష్ణ, శేఖర్ గౌడ్, బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, శ్రీనివాస్, బాబూమియా, జమీర్ సలీం, తిరుమలేష్, శ్రీకాంత్ యాదవ్, భద్రయ్య, సతీష్ రావు, అలాఉద్దీన్ పటేల్, రాములు, పెద్ద భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *