మిస్‌ అండ్ మిసెస్‌ స్ట్రాంగ్‌ అండ్ బ్యూటిఫుల్‌ ఆడిషన్స్

Hyderabad Lifestyle Telangana

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : 

మిస్‌ అండ్ మిసెస్‌ స్ట్రాంగ్‌ – బ్యూటిఫుల్‌ తెలంగాణ – ఆంధ్రప్రదేశ్‌ ఆడిషన్స్‌ ఆకట్టుకున్నాయి.మాసాబ్‌ ట్యాంక్‌ లోని జేఎన్ఎఫ్ యూలో శుక్రవారం నాడు ఉదయం యువతులతో పాటు వివాహిత మహిళల కోసం ఈ పోటీలకు ఆడిషన్స్‌ జరిగాయి. వీరిలో వైద్యులు, ఐటీ ఉద్యోగులు, ఫ్యాషన్‌ డిజైనర్లు, ఔత్సాహిక మోడళ్లు, గృహిణులతో పాటు విభిన్న రంగాలకు చెందిన వారు కూడా హుషారుగా పాలుపంచుకున్నారు.

అందం, అంతకు మించి ప్రతిభావంతులైన 100 మంది మహిళలు హాజరైన ఆడిషన్స్‌ కు సినీ నటుడు నోయెల్, మిస్ ఇండియా సెకండ్ రన్నర్ అప్ 2023 నిషితా మిశ్రా, ఫిలాంత్రపిస్ట్ సిద్దూరెడ్డి కందకట్ల, మిసెస్ ఏషియా గ్రేట్ బ్రిటన్ రన్నరప్ ప్రీతి, కతక్ నృత్యారిణి సంధ్య న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. జ్యూరీల ప్రశ్నలకు వారు సమాధానాలను సందిస్తూ, ర్యాంప్ వాక్ తో కనువిందు చేశారు. వారి నడక, నడత, శక్తియుక్తులను విశ్లేషణ చేసి 50 మంది ఫైనలిస్ట్స్ ను ఎంపిక చేశారు.

ఈ మార్చి 29 న నగరంలో జరుగనున్న గ్రాండ్‌ ఫినాలే లో ఈ 50 మంది ఫైనలిస్ట్‌లు పోటీ పడనున్నారని మిస్‌ అండ్ మిసెస్‌ స్ట్రాంగ్‌ అండ్ బ్యూటిఫుల్‌ వ్యవస్థాపకురాలు కిరణ్మయి అలివేలు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, ఆరోగ్యం పోషకాహారంపై, అలాగే క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పై అవగాహన కల్పించడంతో పాటు మహిళలకు సాధికారత కల్పించేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందన్నారు. ‘మహిళలు తమ అందం మాత్రమే కాక మేధస్సు, శక్తి యుక్తులను గుర్తించి విజయాలు అధిరోహించేలా చెయ్యడం తమ లక్ష్యం గా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *