సృజనాత్మకతను రేకెత్తించిన ఒరిగామి వర్క్ షాప్

Telangana

అరుణ్ దేశాయ్ నేతృత్వంలో కాగితం మడతపెట్టే కళపై రెండు రోజుల శిక్షణ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇటీవల ఒక స్ఫూర్తిదాయకమైన ఒరిగామి వర్క్ షాపును నిర్వహించింది. ఇది తొలి ఏడాది విద్యార్థులకు కాగితం మడత పెట్టే క్లిష్టమైన కళ, దాని నిర్మాణ అనువర్తనాలను పరిచయం చేయడానికి రూపొందించారు.గణితశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్, భారతదేశ ఏకైక పేపర్ ఇంజనీర్ అరుణ్ దేశాయ్ నేతృత్వంలో జరిగిన ఈ వర్క్ షాప్ విద్యార్థులకు సృజనాత్మకత, సాంస్కృతిక వారసత్వం, సాంకేతిక నైపుణ్య అభివృద్ధిలపై లోతైన అవగాహనను కల్పించింది. ఆచరణాత్మక కార్యకలాపాల ద్వారా, ఇందులో పాల్గొన్న ఔత్సాహిక విద్యార్థులు ఉపరితల అభివృద్ధి పద్ధతులపై ప్రత్యేక దృష్టితో, ప్రకృతి నుంచి ప్రేరణ పొందిన కాగితం నిర్మాణం, రేఖాగణిత రూపాలకు కట్-ఫోల్డ్-కన్ స్ట్రక్షన్ విధానాన్ని అలవరచుకున్నారు.విద్యార్థులు త్రీడీ పాప్-అప్ నిర్మాణాల యొక్క ఆకర్షణీయమైన ప్రపంచంలోకి కూడా ప్రవేశించి, నిర్మాణ రూపకల్పనలో వాటి ఆచరణాత్మక అనువర్తనాలపై అవగాహనను పెంపొందించుకున్నారు. ఈ వర్క్ షాప్ వాస్తుశిల్పులకు అవసరమైన లక్షణాలైన సృజనాత్మకత, చక్కటి నైపుణ్యాలను పెంపొందించడమే గాకుండా, బృంద కృషి, వినూత్న ఆలోచనలను కూడా పెంపొందించింది. ఈ కార్యక్రమం కార్యశాలను అసిస్టెంట్ ప్రొఫెసర్లు శ్రుతి గవాలి, నిహారిక కమిసెట్టిల సమన్వయం చేశారు.

శ్రమ-నిర్మాణ కార్మికుల సాధికారతపై కార్యశాల

హైదరాబాదు లోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇటీవల ‘శ్రమ-నిర్మాణ కార్మికుల సాధికారత’ అనే పరివర్తన వర్క్ షాపును ఎథోస్ ఫౌండేషన్ కు చెందిన గీతా బాలకృష్ణన్ నేతృత్వంలో నిర్వహించింది. ఈ కార్యక్రమం ఆర్కిటెక్చర్ విద్యార్థులు, నిర్మాణ కార్మికుల మధ్య అర్థవంతమైన సమన్వయాన్ని పెంపొందించే వేదికగా పనిచేసింది. విద్యా అభ్యాసం, వాస్తవ ప్రపంచ నిర్మాణ సవాళ్ల మధ్య అంతరాన్ని తగ్గించింది.ముఖాముఖి, ప్రెజెంటేషన్లు, నిర్మాణ స్థల సందర్శనల ద్వారా, విద్యార్థులు, నిర్మాణ పరిశ్రమ యొక్క సంక్లిష్టతలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే గాక, పరస్పర అవగాహనను పెంపొందించి, సమగ్ర అభ్యాస వాతావరణాన్ని సృష్టించింది. నిర్మాణ కార్మికులతో నేరుగా పాల్గొనడానికి, వారి నైపుణ్యాలు, పోరాటాలు, వారు చేస్తున్న కృషిపై లోతైన అవగాహనను పొందే అవకాశం విద్యార్థులకు కల్పించారు. క్విజ్, బృంద ప్రదర్శన, అభిప్రాయ వెల్లడి వంటి కార్యక్రమాలు వారిని మరింత దగ్గర చేశాయి. నిర్మాణ విద్యకు సమగ్రమైన, సామాజికంగా బాధ్యతాయుతమైన విధానాన్ని ప్రోత్సహించడానికి విద్యా పాఠ్యాంశాలలో ఇలాంటి వర్క్ షాప్ లను చేర్చాలని విద్యార్థులు అభిలషించారు.ఈ ప్రభావవంతమైన కార్యశాలను అధ్యాపక సమన్వయకర్తలు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సౌపోర్ని పాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అమిత్ భట్టాచార్య సమన్వయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *