క్లినికల్ రీసెర్చపై విజయవంతంగా ముగిసిన కార్యశాల

Telangana

డేటా మేనేజ్ మెంట్, మెడికల్ రైటింగ్, ఫార్మకోవిజిలెన్ పై మార్గనిర్ధేశం చేసిన క్లినోసోల్ సీఈవో

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కెరీర్ గైడెన్స్ సెంటర్ (సీజీసీ) సహకారంతో గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో గురు-శుక్రవారాలలో ‘క్లినికల్ రీసెర్చ్, క్లినికల్ డేటా మేనేజ్ మెంట్, ఫార్మకోవిజిలెన్స్, అండ్ మెడికల్ రైటింగ్’పై నిర్వహించిన రెండు రోజుల కార్యశాల విజయవంతంగా ముగిసింది. ఈ రంగంలో పేరొందిన క్లినోసోల్ రీసెర్చ్ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ వర్క్ షాపులో ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీ.ఎస్.ముజీబుద్దీన్ ప్రధాన వక్తగా వ్యవహరించారు. ఫార్మాస్యూటికల్, లైఫ్ సైన్సెస్ రంగాలపై అమూల్యమైన అంతర్దృష్టులను అందించారు.తమ కెరీర్ లను మెరుగుపరచుకోవడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు, నిపుణుల కోసం రూపొందించిన ఈ కార్యశాల క్లినికల్ రీసెర్చ్, ఫార్మకోవిజిలెన్స్, మెడికల్ రైటింగ్, డేటా మేనేజ్ మెంట్ వంటి కీలకమైన రంగాలలో సమగ్ర జ్జానాన్ని, ఆచరణాత్మక నైపుణ్యాలను అందించే లక్ష్యంతో సాగింది.

అధ్యయన రూపకల్పన, ప్రోటోకాల్ అభివృద్ధి, నియంత్రణ చట్రాలు, ఫార్మకోవిజిలెన్స్ పద్ధతులు వంటి ముఖ్యమైన అంశాలను ఇందులో విశదీకరించారు. ఈ కార్యశాలలో పాల్గొన్నవారు ఆచరణాత్మక అనుభవాన్ని పొందేందుకు, ఉద్యోగ మార్కెట్ లో పోటీతత్త్వాన్ని అందించే నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి వీలు కలిగింది.స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఎస్.కుమార్ అతిథిని స్వాగతించి, విద్యార్థులకు పరిచయం చేశారు. విద్య-పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడంలో ఇటువంటి వర్క్ షాప్ ల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

ఉత్సాహంగా పాల్గొని, ఆయా అంశాలపై కొంతమేరకు అవగాహన ఏర్పరచుకున్న విద్యార్థులను సీజీసీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రమాకాంత బాల్ వందన సమర్పణలో అభినందించారు.ఇందులో పాల్గొన్న వారందరికీ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఇవి వారి వృత్తిపరమైన అభివృద్ధిలో, కెరీర్ అవకాశాలను మెరుగుపరచుకోవడంతో పాటు ఔషధ రంగంలో రాణించడానికి ఎంతగానో ఉపకరిస్తాయనడంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *