గీతంలో సంస్కృతి క్లబ్ ప్రారంభం

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో సంస్కృతి క్లబ్ (స్పిక్ మెకే హెరిటేజ్ క్లబ్ ఆఫ్ గీతం)ను మంగళవారం సంప్రదాయ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ కార్యక్రమం భారతీయ వారసత్వం, సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటడమే గాక, వివిధ కళాత్మక ప్రదర్శనలు, సంప్రదాయాలు, ఆచారాలకు వేదికగా నిలిచింది.విద్యార్థులను సంఘటిత పరిచి, వారిని సంప్రదాయ కళల వైపు ఆకర్షితులను చేసి, సద్భావంతో మెలిగేలా చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైన్ అండ్ ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహించాయి. భారతదేశం యొక్క విభిన్న సాంస్కృతిక వారసత్వం ప్రోత్సహించడానికి విద్యార్థుల సహకారాన్ని వారు అభ్యర్థించారు.

కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థుల ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. బీకాం రెండో ఏడాది విద్యార్థిని యశస్విని తన అద్భుతమైన కూచిపూడి నృత్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగా, బీఏ (సైకాలజీ) విద్యార్థిని ఐశ్వర్య అద్భుతమైన భరతనాట్య ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది.డాక్టర మైథిలి సుశీల్ మరాట్, డాక్టర్ వై.లలిత సింధూరితో సహా పలువురు అధ్యాపకులు, స్టూడెంట్ లైఫ్ ప్రతినిధులు తదితరులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొని, ఈ క్లబ్ విజయవంతంగా నడవాలని అభిలషించారు.

గీతంలో మూడు రోజుల నృత్య, సంగీతోత్సవాలు

గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని లలిత, ప్రదర్శన కళల (ఫైన్ అండ్ ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్) విభాగం ఆధ్వర్వంలో ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. ఈ వేడుకలలో గీతంలోని కళాకారులతో పాటు అతిథి కళాకారులు కూడా వివిధ రకాల సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించనున్నారు.
ప్రారంభ వేడుకలో (బుధవారం) సీహెచ్.శివానీ మంత్రముగ్ధులను చేసే కర్ణాటక గాత్ర ప్రదర్శనతో ప్రారంభిస్తారు. ఆ తరువాత అక్షయ జనార్ధన్ మనోహరమైన భరతనాట్యం ప్రదర్శిస్తారు. డాక్టర్ మైథిలి సుశీల్ మరాట్ చే మనోహరమైన మోహినియాట్టం ప్రదర్శన, డాక్టర్ వై.లలిత సింధూరితో కూచిపూడి నృత్య ప్రదర్శనతో గురువారం ఉత్సవాలు కొనసాగుతాయి. చివరి రోజైన శుక్రవారం డాక్టర్ అన్వేష మహంత మంత్రముగ్ధులను చేసే సత్రియా ప్రదర్శన ఈ వేడుకలకే తలమానికంగా నిలువనుంది. సంప్రదాయ కళారూపాల గొప్పతనాన్ని గౌరవించే ఈ అద్భుతమైన పండుగకు తమతో చేరాలని ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాం అని లలిత, ప్రదర్శన కళల విభాగం అధ్యాపకుడు ఆనందు మురళి అన్నారు. ఈ కార్యక్రమం ప్రతిభను ప్రదర్శించడమే కాదు, ఔత్సాహిక సమూహాన్ని ఒకచోట చేర్చి, మన సాంస్కృతిక వారతస్వం యొక్క ఔన్నత్యాన్ని ప్రశంసించే అవకాశం కూడా అని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *