గీతంలో ఘనంగా నవరాత్రి వేడుకలు

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో విద్యార్థులు బతుకమ్మ, నవరాత్రి సంబరాలను ‘జష్ను-ఎ-బహారా’ పేరిట శుక్రవారం ఘనంగా నిర్వహించారు. డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం, హాజరైన వారికి శాశ్వత జ్జాపకాలను మిగిల్చింది.తొలుత, బతుకమ్మ తయారీతో ఈ సంబరాలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు పూల పండుగ స్ఫూర్తితో అందమైన సాంప్రదాయ పూల అలంకరణలను రూపొందించారు. ఆ తరువాత రంగోలి పోటీలో ఉత్సాహభరితంగా పాల్గొని, తమ సృజనాత్మకతను క్లిష్టమైన రంగోలీ డిజైన్ల ద్వారా ప్రదర్శించి, పండుగ వాతావరణాన్ని సృష్టించారు.విద్యార్థుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా, ఫుడ్ స్టాల్స్ రుచికరమైన వివిధ రకాల వంటకాలను అందించి, విభిన్నమైన వంటల ఆనందాన్ని ఆస్వాదించడానికి వీలు కల్పించాయి. ఇక చివరగా, ఈ వేడుకలను మరపురాని గర్బా నైట్ తో ముగించారు. ఇక్కడ విద్యార్థులు నవరాత్రి పండుగ లయకు అనుగుణంగా నృత్యం చేస్తూ, మైమరచిపోయారు.సాంప్రదాయ వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవ స్ఫూర్తిని కలిపి ‘జష్ను-ఎ-బహారా’లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఒక చిరస్మరణీయ కార్యక్రమంగా మారింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *