– ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు స్వచ్ఛందంగా ఉచిత బోధన
-ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ జిల్లా జిల్లా అధ్యక్షులు పి వెంకటేష్, గౌరవ అధ్యక్షులు డి జగన్మోహన్ రావు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నవ సమాజ నిర్దేశకులైన( ప్రైవేటు పాఠశాలలు) ఉపాధ్యాయులకు పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఐదు లక్షల ప్రమాద బీమా అందజేయబోతున్నట్లు చెప్పడం ఆయన ఉదార స్వభావానికి నిదర్శనమని ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పి వెంకటేష్, గౌరవ అధ్యక్షులు డి జగన్మోహన్ రావులు పేర్కొన్నారు. పటాన్ చెరు పట్టణ శివారులో గల జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన పటాన్ చెరు నియోజకవర్గ ప్రైవేటు పాఠశాలల గురుపూజోత్సవంలో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల గురుపూజోత్సవంతో మాదిరిగానే ప్రైవేటు పాఠశాలల ఆధ్వర్యంలో గురుపూజోత్సవంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. బావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయలు, ఉపాధ్యాయినీలకు తన సొంత నిధులతో ప్రమాద బీమా అందజేస్తున్నట్లు ప్రకటించడం ఆయన మంచితనానికి నిదర్శనమన్నారు. ప్రైవేటు పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలను ఎక్కడ ఉల్లంఘించకుండా రేపటి భావి భారత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. పేద విద్యార్థులను అక్కున చేర్చుకోవడంతోపాటు స్వచ్ఛందంగా పేద విద్యార్థులకు ఉచిత బోధన అందిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను ఎమ్మెల్యే కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర సలహాదారులు యాదగిరి శేఖర్ రావు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
