జులై 20న గీతం 15వ స్నాతకోత్సవం

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ 15వ పట్టాల ప్రదానోత్సవం (స్నాతకోత్సవం) జులై 20, 2024న (శనివారం) నిర్వహించనున్నట్టు గీతం రిజిస్ట్రార్ డాక్టర్ డి. గుణశేఖరన్ వెల్లడించారు.గీతం హైదరాబాద్ ప్రాంగణంలో ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్ , , సైన్స్ ఫార్మసీ, హ్యుమానిటీస్, ఆర్కిటెక్చర్ కోర్సులను 2023-24 విద్యా సంవత్సరం నాటికి పూర్తిచేసిన విద్యార్థులు, డిగ్రీలు పొందడానికి అర్హులని, అందుకోసం జులై 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.ఇతర వివరాల కోసం గీతం వెబ్సైట్ www.gitam.edu ను సందర్శించాలని రిజిస్ట్రార్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *