పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
సంప్రదాయ కంప్యూటర్ సైన్స్ ఉద్యోగాలపై కృత్రిమ మేథ ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సిరోస్పేస్ వంటి కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లకు ప్రాధాన్యం పెరుగుతోందని గీతం అధ్యక్షుడు ఎం. శ్రీభరత్ అన్నారు. హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ‘టన్నెలింగ్’పై బుధవారం నిర్వహించిన ఒక రోజు కార్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీభరత్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, కృత్రిమ మేథ వల్ల కంప్యూటర్ సైన్స్ ఉద్యోగాలపై క్రమంగా ప్రభావం పడుతోందన్నారు. అదే సమయంలో మనదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఏడున్నర లక్షల కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోందని చెప్పారు. వర్ధమాన ఇంజనీర్లకు ఇదో మంచి అవకాశమని, వారు ఎంచుకున్న ఇంజనీరింగ్ బ్రాంచ్లలో మంచి పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. టన్నెలింగ్, భూగర్భంలో నిర్మాణాలు దేపట్టడంపై లోతెన జ్ఞానాన్ని అందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరిశ్రమకు చెందిన సలుపురు ప్రముఖులు పాల్గొన్నారు.జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) భవిష్యత్తు ప్రణాళికలు, ప్రస్తుతం నవరత్న హోదా మహారత్నగా మారబోతున్న విషయాన్ని ఆ సంస్థ జనరల్ మేనేజర్ (పరిశోధన, అభివృద్ధి) ఎస్.కె.చౌరిసియా చెప్పారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, 2040 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారబోతోందని ఆశాభావం వెలిబుచ్చారు.నవంబర్ నెలలో ఉత్తరాఖండ్ లోని సిల్క్యారా టన్నెల్ ప్రమాదం, అందులో చిక్కుకున్న వారిని కాపాడడానికి చేసిన ప్రయత్నాలు, ఉపయోగించిన ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాల గురించి ఆత్మీయ అతిథిగా పాల్గొన్న స్కయ్డ్రోన్ ఇన్ఫ్రా అండ్ మెన్దింగ్ ఎండీ, ముఖ్య కార్యనిర్వహణాధికారి సిరియాక్ జోసెఫ్ వివరించారు. ఆ సనుయంలో ఎదురైన సవాళ్లు, సమష్టిగా తాము వాటిని అధిగమించిన తీరును తెలిపారు. రోజురోజుకు మారుతున్న సాంకేతికతపై పట్టు సాధించి, తనును తాము ముందజంలో ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.సోరంగాలు, భూగర్భ ప్రదేశాలకు సంబంధించిన జియోటెక్నికల్ సరిశోధనలపై విలువెట్టి అంతరృష్టులను హైదరాబాద్ లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సలహాదారు ప్రొఫెసర్ డి.సి.రెడ్డి అందించారు, సిల్క్యారా టన్నెల్ చిక్కుకున్న వారిని రక్షించే కార్యక్రమంలో సిరియాక్ జోసెఫ్ పాత్రను గీతం కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వి.రామశాస్త్రి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ఇతర అతిథులను కూడా పరిచయం చేశారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ అఖిలేష్, చేపూరి స్వాగతోపన్యాసం చేయగా, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ సి.శ్రీనివాస్ వందన సమర్పణ చేశారు.