politics

పటాన్‌చెరులో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

_ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు

_మైత్రి మైదానంలో అలరించిన విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు

_విజేతలకు సొంత నిధులతో నగదు బహుమతులు..

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మినీ ఇండియా గా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పటాన్చెరువు పట్టణంలోని తాసిల్దార్, మండల ప్రజా పరిషత్, జిహెచ్ఎంసి, వ్యవసాయ మార్కెట్ కమిటీ, మైత్రి మైదానంలో ఏర్పాటుచేసిన జాతీయ జెండా ఆవిష్కరణల కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ..సమానత్వంతో కూడిన సమర్థవంతమైన ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగి ఉన్న ఏకైక దేశం భారతదేశం అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నామని తెలిపారు. ప్రధానంగా విద్య వైద్యం ఉపాధి రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అత్యధిక పరిశ్రమలు కలిగిన పటాన్చెరులో కార్మికులకు ఆధునిక వైద్యం అందించేందుకు గాను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వం మంజూరు చేసిందని, అతి త్వరలో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. పారిశ్రామిక రంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఇస్ ఆఫ్ డూయింగ్ విధానం మూలంగా నియోజకవర్గ పరిధిలో కాలుష్య రహిత నూతన పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని, స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు.ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులచే రూపొందించిన కళారూపాలు అందరినీ అలరించాయి.పెరేడ్, సాంస్కృతిక కార్యక్రమాల్లో అత్యుత్తమ ప్రతిభగానపరిచిన పాఠశాలలకు ఎమ్మెల్యే జిఎంఆర్ సొంత నిధులతో నగదు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి 20 వేల రూపాయలు, ద్వితీయ బహుమతి 15 వేల రూపాయలు, తృతీయ బహుమతి పదివేల రూపాయలు అందించారు.ఈ సంవత్సరం మొదటిసారిగా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి పాఠశాలకు 5000 రూపాయల చొప్పున నగదు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ సుష్మ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, తహసిల్దార్ పరమేశం, ఎంపీడీవో బన్సీలాల్, బల్దియా డిప్యూటీ కమిషనర్ బాలయ్య, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మండల విద్యాధికారి రాథోడ్, భారత రాష్ట్ర సమితి పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, పట్టణ ప్రముఖులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన తెలంగాణ యువజన సంఘాల సమితి యువజన వికాస సమితి అధ్యక్షులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…

9 hours ago

అయ్యమ్మ చెరువు పరిస్థితిపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…

9 hours ago

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

1 day ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

1 day ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

3 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

3 days ago