డిజిటల్ షాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ కామర్స్ సంస్థ రేస్‌విన్ మార్ట్

_రేస్‌ విన్ మార్ట్ డిజిటల్ షాప్ యాప్‌ను ప్రారంభించిన సైబరాబాద్ ఏసీపీ శివ భాస్కర్‌ 

_రేస్‌ విన్ మార్ట్ లోని అన్ని కంపెనీల ప్రొడక్ట్స్ ని కస్టమర్స్ కి నేరుగా అమ్ముకునే అవకాశం

మనవార్తలు ,హైదరాబాద్:

హైదరాబాదీ స్టార్టప్ సంస్థ రేస్‌ విన్ మార్ట్ రిటైల్ షాపులు,ఈ కామర్స్‌ల మధ్య గ్యాప్‌ను భర్తీ చేసేందుకు డిజిటల్ షాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ అమీర్‌పేట్ జిజ్జాస స్టూడియోలో డిజిటల్ షాప్ యాప్‌ను సైబరాబాద్ ఏసీపీ శివ భాస్కర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డిజిటల్ షాప్ ద్వారా స్థానిక వ్యాపారులు మరియు ఉత్సాహవంతులైన యువతీ యువకులు. రేస్‌ విన్ మార్ట్ లోని అన్ని కంపెనీల ప్రొడక్ట్స్ ని వారి కస్టమర్స్ కి నేరుగా అమ్ముకునే అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు .మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు ఎంతో మంది యువతకు ఉపాధి కల్పిస్తున్న ఈ ఫ్లాట్ ఫాం మరింత పురోభివృద్ది సాధించాలన్నారు .హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ ప్రయాణం దేశ వ్యాప్తంగా విసర్తించాలని ఆశాభావం వ్యక్తం చేశారు .ఫిజికల్‌మార్ట్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని రేస్‌విన్ మార్ట్‌లో ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండానే వ్యాపారం చేసుకునే అవకాశం ఉందని రేస్‌విన్ సీఈఓ, ఫౌండర్‌ వెంకట్ ఘర్షకోటి తెలిపారు. స్థానిక వ్యాపారులకు దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం కల్పించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు . మా యాప్ ద్వారా ప్రస్తుతం రెండు వేలకుపై ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని 150కిపైగా వ్యాపార సంస్థలు తమ సంస్థ ద్వారా మార్కెటింగ్ చేసుకుంటున్నాయని తెలిపారు .

ఈ కామర్స్ సంస్థలు, బ్రాండ్ స్టోర్లు వచ్చిన తర్వాత రిటైలర్స్‌కు అవకాశాలు తగ్గిపోయాయని దీన్ని భర్తీ చేసేందుకు రేస్ విన్ మార్ట్ సంస్థ డిజిటల్ షాప్ విధానాన్ని మొదటి సారిగా ప్రవేశపెట్టామని వెంకట్ తెలిపారు . దేశవ్యాప్తంగా ఈ డిజిటల్ షాప్స్ ఓపెన్ చేసినటువంటి రిటైలర్స్ కి ఫిజికల్ షాపులో ఎలాంటి మార్జిన్స్ లభిస్తాయో ఈ డిజిటల్ షాప్ లో కూడా వారి కస్టమర్స్ యొక్క ప్రతి పర్చేజ్ పై అలానే మార్జిన్స్ పొందుతూ వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది ఉంటుంది అని తెలియజేశారు.అలాగే మ్యానుఫ్యాక్చరర్స్ కి కూడా ఇన్వెంటరీ సప్లై చైన్ ప్రోడక్ట్ డామేజ్ వీటి మీద వెచ్చించే ఖర్చు పూర్తిగా పూర్తిగా తగ్గిపోతుంది అని తెలిపారు

రేస్‌విన్ మార్ట్ యాప్ ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లకు ఇంటి వద్దకే బుక్ చేసుకున్న ఉత్పత్తులను అందిస్తామన్నారు . వ్యాపారులు షాపును రన్ చేయడానికి ఒక యాప్ ను కస్టమర్ల కోసం మరో యాప్‌ను అందుబాటులో ఉంచామని ఫౌండర్ ,సీఈఓ వెంకట్ తెలిపారు. బహుళజాతి కంపెనీలకు చెందిన ఉత్పత్తులతో పాటు లోకల్‌గా తయారయ్యే ఉత్పత్తులు విక్రయించుకునే అవకాశం కల్పిస్తామన్నారు .డిజిటల్ దుకాణం ప్రారంభించుకోవాలనుకునే వారికి రేస్విన్ యాప్ చక్కిటి పరిష్కారం అందిస్తుందన్నారు .

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago