రామేశ్వరంబండ గ్రామం లో 70 లక్షల రూపాయల సిసిరోడ్డు ప్రారంభం

Districts Telangana

_కెసిఆర్ నాయకత్వంలో గ్రామాలకు మహర్దశ
 _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు:

ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు మండల పరిధిలోని రామేశ్వరం బండ గ్రామం లో 70 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ కోసం నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి గ్రామానికి నెలనెలా నిధులు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు.

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్తుల సమక్షంలో రూపొందించి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న నూతన గ్రామ పంచాయతీ భవనం పనులను పరిశీలించారు. విశాలమైన ప్రాంగణంలో ఆధునిక హంగులతో భవనాన్ని నిర్మించడం పట్ల గ్రామ పాలక వర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంతి రెడ్డి ధరణి రెడ్డి, ఉప సర్పంచ్ నాగేష్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, అంతి రెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *