పార్వతీ అమ్మవారి వివిధ అలంకారాలు
ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, లలితా పారాయణం, అన్నప్రసాద వితరణ
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్‌చెరు పట్టణంలోని మంజీరా క్యాంపస్‌లో కొలువుదీరిన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో పార్వతీ మాతకు 43వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. నేటి నుండి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ అర్చకులు మహేష్ పంతులు తెలిపారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం అమ్మవారికి విశేష అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించనున్నారు. సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు లలితా పారాయణం నిర్వహించనున్నారు. అమ్మవారి దీక్ష చేపట్టిన భక్తులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయనున్నారు. నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి విశేష పూజలు నిర్వహించనున్నట్లు అర్చకులు వెల్లడించారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 11న బాలా త్రిపుర సుందరి దేవిగా, 12న గాయత్రీ దేవిగా, 13న అన్నపూర్ణాదేవిగా, 14న చండీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.అక్టోబర్ 15న గురువారం లలితా పంచమి సందర్భంగా అమ్మవారిని లలితా దేవిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా చండీ హవనం నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని ఆలయ అర్చకులు కోరారు.అక్టోబర్ 16న మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతీ దేవిగా అలంకరించనున్నారు. ఈ సందర్భంగా చిన్నారులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యాభివృద్ధి, జ్ఞానప్రాప్తి కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్వాహకులు సూచించారు.అక్టోబర్ 17న మహాలక్ష్మి దేవిగా, 18న దుర్గాదేవిగా, 19న మహిషాసురమర్దిని దేవిగా అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆయా రోజుల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించనున్నారు.
అక్టోబర్ 20న విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు శమీ పూజ, రావణాసుర దహనం తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. విజయదశమి వేడుకలను భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.నవరాత్రి ఉత్సవాలు భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు, అమ్మవారి అనుగ్రహాన్ని పొందేందుకు గొప్ప అవకాశమని అర్చకులు తెలిపారు.
రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…
ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…
ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…
శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…