Telangana

యూరో కీడ్స్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రకృతిని దైవంగా భావించి పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని యూరో కిడ్స్ స్కూల్‌ చైర్మన్ గాదే మహేష్ అన్నారు .పటాన్‌చెరు యూరో కిడ్స్ స్కూల్‌ లో శనివారం బతుకమ్మ పండుగ సంబరాలు అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగాయి. పాఠశాల చైర్మన్ గాదే మహేష్, ప్రధాన ఉపాధ్యాయులు గాదే సంజన మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు .​రంగురంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలను పాఠశాల ఆవరణలో ఉంచి, విద్యార్థినులు, ఉపాధ్యాయురాళ్లు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మల చుట్టూ తిరుగుతూ భక్తిశ్రద్ధలతో పాటలు పాడుతూ కోలాటం ఆడారు.అనంతరం చైర్మన్ గాదే మహేష్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిదర్శనం బతుకమ్మ పండుగ మరియు విజయదశమి {దసరా} ప్రకృతిని దైవంగా భావించి పూజించే గొప్ప పండుగలను విద్యార్థులకు పరిచయం చేయడం, మన సాంప్రదాయాలను తరువాతి తరాలకు అందించడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశం” అని తెలిపారు. యూరో కిడ్స్ స్కూల్ ఆవరణలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో బతుకమ్మ సంబరాలను మరియు విజయదశమి రోజున జరిపే మహిషాసుర వర్ధిని కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించామని అన్నారు. ఈ బతుకమ్మ పండుగ ప్రతి ఇంట సంతోషాన్ని ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలను సుఖ సంతోషాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు.

 

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

14 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

17 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

19 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

19 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

19 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago