Telangana

పూల పండుగతో పులకించిన తెల్లాపూర్ చెరువు..

బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మల్లేపల్లి సోమిరెడ్డి దంపతులు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు తెల్లాపూర్ డివిజన్‌లోని తెల్లాపూర్ చెరువు వద్ద ఘనంగా జరిగాయి. ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయత, ఐక్యతను చాటుతూ బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా నిర్వహించారు. దీంతో తెల్లాపూర్ చెరువు పరిసరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి.వేడుకల్లో తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి, ఆయన సతీమణి లలిత సోమిరెడ్డి పాల్గొని మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

14 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

17 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

19 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

19 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

19 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago